ఏపీ మూడు రాజధానులపై కేంద్రం మరోసారి క్లారిటీ..!

Thursday, September 10th, 2020, 12:51:46 PM IST

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ మరోసారి క్లారిటీ ఇచ్చింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం ఉండదని ఇప్పటికే ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.

అయితే ఈ అఫిడవిట్‌లో మూడు రాజధానుల అంశంపై కేంద్రం మరింత క్లారిటీ ఇచ్చింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, సెక్షన్ 13 ప్రకారం రాజధాని ఆంటే ఒకటికే పరిమితం కావాలని కాదని అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే కేంద్రం చెప్పిందని ఎన్ని రాజధానులు ఏర్పాటు చేసుకుకోవాలన్న నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధించిందని తెలిపింది.