ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

Thursday, September 17th, 2020, 11:12:26 PM IST


గత కొద్ది రోజుల నుండి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోగ్యం దేశ ప్రజలను ఆందోళన కి గురి చేస్తోంది. ఇటీవల మళ్లీ ఎయిమ్స్ లో అనారోగ్యం కారణంగా చేరిన అమిత్ షా, తాజాగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాడు ఆసుపత్రి లో చేరిన అమిత్ షా, ఆరోగ్యం కుడటపడటం తో డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం నుండి కేంద్ర మంత్రి పార్లమెంట్ సమావేశాలకు హజరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే గత నెలలో కరోనా వైరస్ భారిన పడిన అమిత్ షా, కోలుకొని డిశ్చార్జ్ అయిన కొద్ది రోజుల్లోనే మళ్లీ అనారోగ్యం భారిన పడ్డారు.