మళ్లీ ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా?

Sunday, September 13th, 2020, 09:32:31 AM IST

కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన నెలకొంది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన అమిత్ షా, మళ్లీ రెండు వారాల తర్వాత ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రి లో చేరారు. శనివారం నాడు అనారోగ్యానికి గురి కావడం తో ఆసుపత్రి లో చేరినట్లు తెలుస్తోంది. అయితే గత నెల ఆగస్ట్ 2 న తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో గుర్గావ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చేరారు. ఆ తర్వాత 14 వ తేదీన తన ఆరోగ్యం పై సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

వైద్యుల సలహమేరకు హోమ్ ఐశోలేశన్ లో ఉండేందుకు కూడా సిద్దం అయ్యారు. అయితే నీరసం, వొళ్ళు నొప్పులతో ఆగస్ట్ 18 న ఎయిమ్స్ లో చేరగా, 31 వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర మంత్రి పూర్తి గా కోలుకున్నారు అని ఆసుపత్రి వర్గాలు సైతం వెల్లడించాయి. అయితే మళ్ళీ ఇప్పుడు అనారోగ్యానికి గురి కావడం తో ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రి కి అమిత్ షా ను తరలించారు. అయితే ఆసుపత్రి వర్గాలు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు.