అన్ లాక్ 5.0: కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే!

Thursday, October 1st, 2020, 01:24:27 AM IST


భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఆరు నెలల పాటుగా లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం దేశ ఆర్ధిక పరిస్థితి ను మెరుగు పరుచు కొనేందుకు కేంద్రం అన్ లాక్ ప్రక్రియ 5.0 కి మార్గ దర్షకాలను విడుదల చేయడం జరిగింది. అయితే కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో 5 వ దశ లాక్ డౌన్ మినహాయింపు లు సడలిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 31 వరకు కంటైన్ మెంట్ జోన్ లలో లాక్ డౌన్ ను కొనసాగించడం జరుగుతుంది. అక్టోబర్ 15 నుండి 50 శాతం సీట్ల సామర్ధ్యం లో సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్ లు తెరిచేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది.

అయితే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్ పూల్ లకు అనుమతి ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో పాటశాల ల పునః ప్రారంభానికి వెసులు బాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో పరిస్తితులను బట్టి దశల వారీగా పాటశాల ల పునః ప్రారంభం కి అనుమతి ఉండనుంది. అయితే సంబంధిత విద్యా సంస్థలు మరియు పాటశాల ల యాజమాన్యాల తో చర్చల అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆన్లైన్ బోధనా విధానం తో పాటుగా, దూరవిద్య కి ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అయితే ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు మొగ్గు చూపితే పాటశాలలు అనుమతించవచ్చు అని తెలిపింది. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో నే పాటశాలల్లోకి విద్యార్థుల ప్రవేశం అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే పాటశాలల పునః ప్రారంభం పై ఆయా రాష్ట్రాలు భద్రతా మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది, అయితే అవి కూడా కేంద్ర పాటశాల విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుబంధం గా భద్రతా నిబంధనలు ఉండాలి. పునః ప్రారంభం అయ్యే పాఠశాలలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలి. అంతేకాక కళాశాల ల పునః ప్రారంభం పై ఉన్నత విద్యావిభాగం నిర్ణయాలు తీసుకునే అవకాశం.