బిగ్ న్యూస్: ఇక ఢిల్లీ లో కూడా తెరాస కార్యాలయం!

Saturday, October 10th, 2020, 01:15:56 AM IST


కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. తెరాస పార్టీ కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లో స్థలాన్ని కేటాయించడం జరిగింది. అయితే వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలం ను కేటాయించిన విషయం ను కేంద్ర గృహ నిర్మాణ శాఖ సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్థలాన్ని ప్రభుత్వం రెండు బ్లాకుల గా విభజించుకొనుంది. 550 చదరపు మీటర్ల చోపున రెండు బ్లాకులను కేటాయించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలం లో పార్టీ కార్యాలయం నిర్మాణం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల కోసం ఈ స్థలం ను కేటాయించినట్లు తెలుస్తోంది.