క‌ల్తీ క‌ల్తీ క‌ల్తీ.. సంఘంలో ఎలా బ‌త‌కాలి దేవుడోయ్‌!!

Wednesday, February 22nd, 2017, 03:47:28 PM IST


క‌ల్తీ క‌ల్తీ క‌ల్తీ.. దేవుడోయ్ ఇలా అయితే స‌మాజంలో ఎలా బ‌త‌కాలి? ప‌్ర‌స్తుతం అంద‌రి మెద‌ళ్ల‌ను తొలిచేస్తున్న వెయ్యి ట‌న్నుల బ‌రువైన ప్ర‌శ్న ఇది. ప్ర‌తిదీ క‌ల్తీ. పీల్చే గాలి… తాగే నీరు.. ఉప్పులు.. ప‌ప్పులు.. నెయ్యి.. బెల్లం.. కాఫీ పొడి… టీపొడి.. కారం .. ఒక‌టేమిటి నిత్యావ‌స‌రాల‌న్నీ క‌ల్తీనే. ఈ క‌ల్తీల వ్య‌వ‌హారంలో రోజుకో మాఫియా ముఠా దొరికిపోతోంది. టీవీలో వార్త‌లు పెడితే చాలు…. పాల‌పొడులు క‌ల్తీలు చేస్తున్న గ్యాంగ్ .. కల్తీ కారం ప‌ట్టివేత‌.. క‌ల్తీ నెయ్యి గ్యాంగ్ అరెస్ట్ .. పాల పొడుల క‌ల్తీ .. అంటూ రోజూ వార్త‌లే వార్త‌లు. ఈ క‌ల్తీ రాకెట్లు ఎన్ని దొరికిపోతున్నా.. అంత‌కుమించి పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్య‌వ‌స్థీకృత నేరాల్ని అరిక‌ట్టాలంటే ఇప్పుడున్న పోలీసింగ్ స‌రిపోతుందా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. క‌ల్తీని ఆపే మ‌హాశ‌క్తి ఇక పుట్ట‌దు. ప్ర‌జ‌లు నిత్య ం ఈ క‌ల్తీనే ఆశ్ర‌యించాల్సిందే. మోస‌పోవాల్సిందే. అత్య ంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌, విష‌పూరిత‌మైన ఆహార ప‌దార్థాల్ని తిని ఆయుక్షీణంతో చావాల్సిందే. ఇది ఫిక్స్‌. కొంద‌రి స్వార్థ‌పూరిత లాభాపేక్ష కోసం, ధ‌నార్జ‌న కోసం వ్య‌వ‌స్థ చంక‌నాకి పోవాల్సిందే. జ‌నం నిలువునా మోస‌పోవాల్సిందే. ద‌హించుకుపోవాల్సిందే. అంతెందుకు ఇవ‌న్నీ క‌ల్తీలు అయిపోతున్నాయి. క‌నీసం క‌ల్తీ లేని ఫ‌లాలు (పండ్లు) అయినా తిందాం .. కొంత‌యినా ఆరోగ్యాల్ని ర‌క్షించుకుందాం అనుకునే ప్ర‌జ‌ల‌కు భీతావ‌హ‌మైన విష‌యాలెన్నో తెలుస్తున్నాయి. కాయ పండు అవ్వ‌డానికి, మ‌గ్గబెట్ట‌డానికి ఉప‌యోగించేవి కూడా విష‌పూరిత ర‌సాయ‌నాలే. ప‌ళ్ల‌ను మ‌గ్గ‌బెట్ట‌డానికి ఉప‌యోగించే గ్యాసెస్, పౌడ‌ర్ల వ‌ల్ల నాడీ క్షీణ‌త‌, న‌రాల బ‌ల‌హీన‌త వంటి ప్ర‌మాద‌క‌ర రోగాలెన్నో వ‌స్తున్నాయి. అందుకే బ‌య‌ట పండు తింటే పంచ్ ప‌డుతుంది అని భ‌య‌ప‌డిపోవాల్సిన దుస్థితి నెల‌కొని ఉంది.

మ‌రి ప్ర‌జ‌లు ఇంకేం తినాలి? ఏ క‌ల్తీ లేని గ‌డ్డి ముందు వేసుకుని తినాలేమో? పోనీ ఆ గ‌డ్డి ఏమైనా క‌ల్తీది కాదా? అంటే వామ్మో విషం చిమ్మే నిజం ఇక్క‌డే తెలిసింది. ఇప్పుడు మార్కెట్లో దొరికే గ‌డ్డి (కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు అన్న‌మాట‌) నిండా ఒక‌టే విషం. పురుగుమందులు పిచికారీ అవ‌స‌రానికి మించి. ఇక‌పోతే కొన్నిచోట్ల మురుగుకాల్వ‌ల‌పై పండించే ఆకుకూర‌ల్ని తెచ్చి అమ్మేస్తున్నారు. డ‌బ్బు కోసం ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌న కాలుష్యంతో నిండి ఉండే మూసీ మురుగునీట్లో పండించే ఆకుకూర‌ల్ని మార్కెట్లో అమ్మేస్తున్నార‌న్న నిజం తెలిస్తే ఇక ఎవ‌రూ మార్కెట్‌కే వెళ్ల‌రు. వెళ్లినా కొన‌లేరు. ఇలాంటి దారుణాలెన్నో న‌గ‌రాల్లో ఉన్న కోటానుకోట్ల ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్నారు. మూసీప‌రివాహ‌క ప్ర‌దేశంలో పండించే ఆకుకూర‌ల్లో ఆర్సీనియం వంటి విష‌పూరిత ర‌సాయ‌నాలు ఉంటున్నాయి. వీటి వ‌ల్ల పేగు క్యాన్సర్లు వంటివి వ‌స్తున్నాయ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇక గాలి కాలుష్య ం మాట స‌రేస‌రి. ఇక‌మీద‌ట మెట్రోల్లో, హైద‌రాబాద్‌లో కొన్నిచోట్ల (ఉప్ప‌ల్, ఫీర్జాదీ గూడ …) మ‌నిషి బ‌తుక్కి, మ‌నుగ‌డ లేద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్తలు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే భ‌విష్య‌త్ లేదు న‌గ‌రాల్లో. ప‌ట్టండి ప‌ల్లెబాట! అన్న‌ట్టే ఉంది. (నేటి ఏపీ ఎక్ల్స్‌క్లూజివ్‌)