విషాదం నింపిన ఏనుగు ఘటనలో ఊహించని ట్విస్ట్..తిన్నది పైనాపిల్ కాదు!

Saturday, June 6th, 2020, 04:37:39 PM IST

గత కొన్ని రోజుల క్రితం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో కొందరు ఆకతాయిలు చేసిన పనికి గర్భంతో ఉన్న ఒక ఏనుగు మరణించడం ప్రతీ ఒక్కరిని ఎంతగానో కలచి వేసింది. గుండెను ముక్కలను చేసిన ఈ ఘటన మూలాన ఎందరో సెలెబ్రెటీలు కూడా తమ ఆక్రోశాన్ని ఆపుకోలేకపోయారు.

ఆ ఏనుగుకి పైనాపిల్ లో పేలుడు పదార్ధం పెట్టిన వారిని శిక్షించాలని ప్రతీ ఒక్కరు ఎంతగానో డిమాండ్ చెయ్యగా ఈ ఘటనకు కారకులు అయిన వారిలో విల్సన్ అనే ఒకతన్ని పట్టుకొని అటవీ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణలో ఊహించని విషయాన్ని అతను బయట పెట్టాడు.

తాను రబ్బరు సేకరించే పని చేసుకుంటానని వారు పేలుడు పదార్ధాలు చేసేవారని ఆరోజు వారు తనను వారితో పాటూ తీసుకెళ్లారని అలాగే ఆరోజు ఏనుగుకు పెట్టింది కూడా పైనాపిల్ కాదు కొబ్బరి బొండం అని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

దీనిపై అధికారులు మరింత వివరణ ఇస్తూ ఆ ఏనుగు అప్పటికే ఏదైనా తిని 20 రోజులకు పైన అయ్యి ఉంటుందని ఆ సమయంలో వీరు ఆ కొబ్బరి బొండాం ఇచ్చేసరికి అది తీసుకోగా నోటికి తీవ్ర గాయలయ్యి తర్వాత చనిపోయింది అని వారు నిర్ధారించారు.