మాజీ ఎంపీ ఉండవల్లి కి సోకిన కరోనా!

Wednesday, August 26th, 2020, 11:14:08 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఎంపీ లు, ఎమ్మెల్యే లు, మంత్రుల తో సహా పలువురు ప్రముఖులు సైతం ఈ వైరస్ భారిన పడుతున్నారు. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. సీఎం జగన్ పాలన విధానం పై, రాష్ట్రం లోని పలు సమస్యల పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ పలు ప్రెస్ మీట్ ల ద్వారా అందుబాటు లో ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ లాక్ డౌన్ కారణం గా బయటికి రావడం లేదు అని తెలుస్తోంది. అయితే గత రెండు రోజుల నుండి అనారోగ్యం తో బాధపడుతూ ఉండటం తో తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు.

అయితే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. అయితే గత వారం రోజుల నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్న వారు అంతా కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ స్వీయ నిర్బంధం లోకి వెళ్ళారు. ఏపీ లో రోజుకి పది వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.