మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్..!

Thursday, August 27th, 2020, 07:21:25 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

అయితే తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కి కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అనేక అంశాల మీద మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ఉండవల్లి, కరోనా కారణంగా చాలా రోజుల నుంచి మీడియా ముందుకు రావడం లేదు. అయితే రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన రాజమండ్రిలోని తన ఇంట్లోనే హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు.