జగన్ సర్కార్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్..!

Tuesday, December 22nd, 2020, 04:01:27 PM IST

జగన సర్కార్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి షాకింగ్ కామెంట్శ్ చేశారు. ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ తప్పితే వేరే మార్గం లేదని, ఆ క్లాజ్ ఉపయోగించి తెలంగాణ ప్రాజెక్టులు కట్టాలని చూస్తోందని అన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టులో 41 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలన్న జగన్ సర్కార్ ఆలోచన విధానం సరికాదని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దని, అలా చేస్తే తర్వాత ఎవరూ పోలవరాన్ని పట్టించుకోరని అన్నారు.

అయితే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని కేంద్రంతో పోరాడి సాధించుకోవాలని, రాజీపడితే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినవారు అవుతారని హెచ్చరించారు. డీపీఆర్‌ ప్రకారం పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తూ వస్తుందని పోలవరం విషయంలో కేంద్రంతో సంప్రదింపులపై జగన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. నిజాలు చెప్పకుండా జగన్‌ జనాల్ని మభ్యపెడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్ట్‌లకు అభ్యంతరం చెబితే జైల్లో పెడతానని జగన్‌ను కేసీఆర్ హెచ్చరించారని ఉండవల్లి చెప్పుకొచ్చారు.