జగన్ సంక్షేమ కార్యక్రమాలపై ఉండవల్లి షాకింగ్ కామెంట్స్..!

Sunday, November 29th, 2020, 03:00:03 AM IST

ఏపీ సీఎం జగన్‌పై, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి పాదయాత్రలో ఇచ్చిన హామీలను, వాగ్దానాలను సీఎం జగన్ పునఃసమీక్షించుకోవాలని అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదాల పేరుతోనే అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అంతేకాదు జగన్ నవరత్నాలపై కూడా ఉండవల్లి సెటైర్లు వేశారు. అన్నంలో రోజూ తోటకూరతో తింటే ఏం బలమొచ్చేస్తుందన్న అని చెప్పిన ఒకాయన.. తాము అధికారంలోకి వచ్చాక రోజూ పప్పు, గ్లాసు పాలు, ఒక గుడ్డు ఇస్తామన్నాడని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక అలాగే చేశాడని కానీ తినడానికి అన్నం లేదు. కలుపుకోవడానికి అన్నం లేకపోతే అవన్నీ ఇచ్చి ఏం ప్రయోజనం అంటూ ఎద్దేవా చేశారు. తినడానికి డబ్బులు సంపాదించుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయని, మౌలిక సదుపాయాల గురించి ఏం చేస్తున్నారని జగన్ సర్కార్‌ని ప్రశ్నించారు.