ఆ పార్టీ కి ఒకశాతం ఓట్లు కూడా రాకపోవడం గమనించాలి – ఉండవల్లి అరుణ్ కుమార్

Tuesday, January 12th, 2021, 03:18:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని తాజా పరిణామాల పై మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల్లో విగ్రహాల ద్వంసాలకి పాల్పడే వారు సంఘ విద్రోహ శక్తులు అని అన్నారు. అలాంటివారి కి ఎటువంటి పార్టీ ఉండదు అంటూ స్పష్టం చేశారు. అయితే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిని ఆరంభం లోనే కఠినం గా శిక్షిస్తే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి అని తెలిపారు. అయితే ఈ ఆలయాల విగ్రహాల ద్వంసాల అంశం విషయం లో 95 శాతం మంది ఓటర్లు ఓ హిందూజాతీయ పార్టీ కి మద్దతు ఇస్తున్నారు అని, అదే పార్టీ కి ఎన్నికల వేళ ఒక్క శాతం ఓట్లు కూడా రాకపోవడం ప్రజలు గమనించాలి అని అన్నారు.

అయితే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి పనులు భవిష్యత్ లో దేశానికి, రాష్ట్రానికి ముప్పుగా పరిణమించే పరిస్థితులు నెలకొంటాయి అని హెచ్చరించారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా బాధ్యతాయుత పదవీ లో ఉన్న ఒక నేత పవిత్ర గ్రంధాలు అయిన భగవద్గీత మరియు బైబిల్ పేర్లను ప్రస్తావించారు అంటూ తెలిపారు. అయితే ఉండవల్లి మాత్రం ఇలా వ్యాఖ్యలు చేసిన వారి పై అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.