వాక్సిన్ తీసుకున్నాక మృతి చెందిన ఆ ఇద్దరు

Tuesday, January 19th, 2021, 08:48:55 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం సంతోషకరం అని చెప్పాలి. అయితే వాక్సిన్ తీసుకున్న ఇద్దరు మృతి చెందడం తో ఆందోళన నెలకొంది. కర్ణాటక లో ఒకరు, ఉత్తర ప్రదేశ్ లో మరొకరు మృతి చెందడం తో పలు చోట్ల ఆందోళన నెలకొంది. అయితే ఈ రెండు మరణాల తో ఆయా ప్రభుత్వాల్లో కలకలం మొదలైంది. కర్ణాటక లో నాగరాజు అనే గ్రూప్ డి ఉద్యోగి కోవిషీల్డ్ తీసుకున్న రెండో రోజు మృతి చెందాడు. అయితే అది హార్ట్ ఎటాక్ వలన అని, వాక్సిన్ వలన కాదు అంటూ వైద్యులు అంటున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో ఒక ఆరోగ్య కార్యకర్త కరోనా వాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే మృతి చెందాడు.అయితే అతను కూడా గుండె శ్వాస సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.