ఆ ఒక్క జిల్లాలోనే రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

Wednesday, September 9th, 2020, 01:47:29 AM IST


భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వేల సంఖ్యలో నమోదు అవుతున్న ఈ పాజిటివ్ కేసుల సంఖ్య తో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే భారత్ లో ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, యూపీ, కర్ణాటక, తమిళ నాడు ప్రాంతాల్లో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతుంది. అయితే తాజాగా ఒక్క పుణె లోనే రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

అయితే ఒకే జిల్లాలో రెండు లక్షలు కరోనా వైరస్ కేసులు దాటిన జిల్లా గా పుణె నిలవడం గమనార్హం. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పై అయిదు రాష్ట్రాలను మినహాయిస్తే, మిగతా ప్రాంతాల్లో కరోనా వైరస్ నమోదు అవుతున్న రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే కూడా ఇక్కడ ఎక్కువ కేసులు నమోదు అవ్వడం ప్రజలను ఆందోళన కి గురి చేస్తోంది.