ఢిల్లీ లో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

Thursday, September 10th, 2020, 01:11:08 AM IST

Corona_india
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారీగా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ లో సైతం కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,039 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 2,01,176 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20 మంది ఈ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోయారు.

తాజాగా నమోదు అయిన ఈ మరణాల తో కరోనా వైరస్ భారిన పడి ఇప్పటి వరకు ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 4,638 కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో 2,623 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,72,736 కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీ లో 23,773 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే రోజు రోజుకి ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతుండటం తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.