నకిలీనోట్ల ముద్రణ కేసులో టివి నటి అరెస్ట్ ?

Wednesday, July 4th, 2018, 10:00:15 PM IST

నకిలీనోట్లు ముద్రించిన కేసులో మలయాళ టివి సీరియల్ నటి సూర్య శశికుమార్ (36) ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆమెతో పాటు ఆమె తల్లి రమాదేవి, సోదరి శృతి లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొల్లంలోని తమ ఇంటిలో 57 లక్షల దొంగనోట్లను ముద్రించిన కేసులో .. కొచ్చిలో వీరిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇందులో రమాదేవికి ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కొల్లం లోని వారి ఇంటిపై పోర్షన్ లో దొంగనోట్ల ముద్రణ జరుగుతున్నట్టు చెప్పారు. ఈ నోట్లను ముద్రించేందుకు 4 లక్షలకు పైగా ఖర్చు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి జల్సాల కోసం అలవాటు పడ్డ వీరు ఇలాంటి నేరం చేసారని తెలిపారు.