కరోనా కేసుల పెరుగుదలతో టీటీడీ కీలక నిర్ణయం!

Wednesday, July 15th, 2020, 09:13:19 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తెలుగు రాష్ట్రాలలో సైతం తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సైతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 13 రోజుల్లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 28 కి చేరింది. ఈ నేపధ్యంలో టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి బర్డ్ ఆసుపత్రి లో ఇక కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన వారికి చికిత్స అందించనుంది. ఇక ఇక్కడ కరోనా వైరస్ సేవలు అందుబాటులో ఉందనున్నాయి.

అయితే తిరుపతి లో ఉన్న విష్ణు నివాసం ను సైతం కోవిద్ సెంటర్ గా మార్చేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 224 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 135 తిరుపతి కి చెందినవే. అయితే కేసుల పెరుగుదల నేపధ్యం లో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కేసుల పెరుగుదల కారణంగా ప్రజలు సైతం బయటికి రావడం లేదు. అక్కడి దుకాణాలు పూర్తిగా మూసివేసి ఉంచడం గమనార్హం.