టీటీడీ: భక్తులకు నేటినుండి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు

Monday, October 26th, 2020, 10:17:54 AM IST

కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న కారణంగా ఇన్ని రోజులు శ్రీవారి దర్శనానికి సైతం ఆంక్షలు విధించారు. అయితే భక్తులకు నేటి నుండి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇన్ని రోజులు కరోనా వైరస్ మహమ్మారి కారణం గా శ్రీ వారి ఉచిత దర్శనం ను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. కాగా నేటి నుండి శ్రీవారి ఉచిత దర్శనం సేవలు కొనసాగించేందుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ లో ఈ టోకెన్ లను జారీ చేయనున్నారు. అయితే టోకెన్ పొందిన భక్తులకు మరుసటి రోజు న దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే రోజుకి మూడు వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.లాక్ డౌన్ కారణంగా శ్రీవారి దర్శనము ఆపేసిన టీటీడీ, జూన్ 11 నుండి సేవలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.