బిగ్ న్యూస్: టీటీడీ లో 140 మందికి కరోనా పాజిటివ్… వై వి సుబ్బారెడ్డి ఏమన్నారంటే!

Thursday, July 16th, 2020, 07:56:52 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే తిరుమల లోని టీటీడీ సిబ్బందికి సైతం కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే టీటీడీ లో 140 మందికి కరోనా వైరస్ సోకిన విషయం రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. కరోనా సోకిన వారిలో అర్చకులు, సెక్యూరిటీ సిబ్బంది, లడ్డు లు తయారీ చేసేవారు ఇంకా టీటీడీ ఉద్యోగులు సైతం ఉన్నారు.

అయితే 140 మందిలో 70 కి పైగా కోలుకొని స్వీయ నిర్బంధం లో ఉన్నట్లు వై వి సుబ్బారెడ్డి తెలిపారు. ఒక్కరూ మినహా మిగతా అందరూ ఆరోగ్యం గా ఉన్నారు అని వ్యాఖ్యానించారు.అయితే దర్శనాలు నిలిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే రమణ దీక్షితులు చేసిన ట్వీట్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే చర్చ జరుపుతామని అన్నారు. అర్చకుల పరిస్తితి ప్రమాదకరం గా మారితే దర్శనం ఆపేస్తం అని అన్నారు. దర్శనమ్ సంఖ్య తగ్గించడం, పెంచడం ఉంటుంది అని వ్యాఖ్యానించారు.