కరోనాతో టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు మృతి..!

Friday, August 7th, 2020, 10:54:27 AM IST

టీటీడీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతూ ఉండగా, ఇప్పటికే పలువురు అర్చకులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా కరోనా బారిన పడి అర్చకుడు శ్రీనివాసాచార్యులు మృతి చెందాడు. దీంతో అర్చకులలో ఆందోళన మొదలయ్యింది. విధులు నిర్వహించేందుకు అర్చకులు భయపడుతున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఆర్చకుడు శ్రీనివాసాచార్యులు మృతి చెందడంతో పలువురు అర్చకులు ఆనంద నిలయంలో సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితో అర్చకులు చర్చలు జరిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో శ్రీవారి కళ్యాణోత్సవ సేవలను ఈ నెల 31 వరకు నిలిపివేయాలని సూచించినట్టు తెలుస్తుంది.