టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి కరోనా పాజిటివ్

Thursday, October 15th, 2020, 12:30:26 PM IST

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సైతం కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోగా అందులో వైవీ సుబ్బారెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇటీవల టీటీడీ నిర్వహించిన సమావేశం లో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

అయితే వైవీ సుబ్బారెడ్డి ను ఆ సమావేశం లో కలిసిన వారు అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంతేకాక ఈ నెల 12 న వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పుట్టిన రోజు సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సుబ్బారెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో అతని తల్లి ఆరోగ్యం పై సైతం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కరోనా వైరస్ భారిన పడ్డవారు ఉన్నారు. కొందరు కోలుకోగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు.