ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు – మంత్రి ఇంద్రకరణ్

Saturday, September 5th, 2020, 01:00:23 AM IST

విద్యార్థుల భవిష్యత్ దిశా నిర్దేశకులు ఉపాధ్యాయులే అంటూ అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. భావి భారత పౌరులకు తీర్చి దిద్దడం లో వీరి పాత్ర ఎంతో విలువైనది అని కొనియాడారు. ఈ మేరకు సెప్టెంబర్ అయిదు న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే విద్య నేర్పిన గురువులను పూజించే సంస్కృతి భారతదేశం లో ఉంది అని ఆయన అన్నారు. అబ్దుల్ కలామ్ ప్రస్తావన తీసుకు వస్తూ, ఆయన చెప్పినట్లు గా విద్యార్థుల్లో మంచి లక్షణాలను పెంపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలకం అని తెలిపారు. అంతేకాక రాష్ట్రం లో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అంటూ వ్యాఖ్యానించారు. అందులో భాగంగా నే ఈచ్ వన్ టీచ్ వన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటూ ఆయన పేర్కొన్నారు.