ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి హరీశ్ రావు

Thursday, October 15th, 2020, 05:12:53 PM IST

తెలంగాణ రాష్ట్రం లో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా రవాణా నుండి అన్ని కార్యకలాపాల పై వీటి ప్రభావం గట్టిగానే ఉంది. అయితే రైతుల పంటలు మాత్రమే కాకుండా, పలు చోట్ల అస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే ముంపు ప్రాంతాలను తెరాస పార్టీ కి చెందిన నేతలు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి, కాలనీలు సైతం పలు చోట్ల పూర్తిగా వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడిన హరీశ్ రావు, సమీక్ష నిర్వహించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు.