అపుడు ఉస్మానియా…ఇపుడు సచివాలయానికి అడ్డుపడుతున్నారు!

Thursday, July 16th, 2020, 09:55:03 PM IST


ఉస్మానియా ఆసుపత్రి లో జరిగిన ఘటన పై ప్రతి పక్ష పార్టీ నేతలు అధికార పార్టీ తెరాస పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కఠిన పరిస్తితుల్లో ప్రతి పక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని కోరారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మీడియా సమావేశం లో అన్నారు.

అయితే ఉస్మానియా ఘటనను హైకోర్టు సుమోటో గా తీసుకొని ఒక మార్గం చూపించాలని కోరారు. అయితే గతం లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ ప్రక్రియను ప్రతి పక్షాలు అడ్డుకున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అపుడు ఉస్మానియా ను అడ్డుకున్నట్లుగానే ఇపుడు సచివాలయం ను అడ్డుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే బీజేపీ నేతల పై సైతం తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఒక డ్రామా, ఢిల్లీ లో మరో డ్రామా బీజేపీ నేతల ది అని ఆరోపించారు.