హైదరాబాద్ లో కాంగ్రెస్ కు అతీగతీ లేదు…మంత్రి సంచలన వ్యాఖ్యలు!

Wednesday, September 23rd, 2020, 12:39:14 AM IST


తెలంగాణ రాష్ట్రం లో పేద ప్రజల కి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం కొన్ని నిర్మాణం పూర్తి కాగా, మరి కొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం గత కొద్ది రోజుల నుండి రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ పై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న వరుస విమర్శల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ నేతల వైఖరి ను తిప్పికొడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాస్యాస్పదం అని, నాంపల్లి లో తాము నిర్మించింది ఒక దగ్గర అయితే, కాంగ్రెస్ నేతలు చూసింది మరొక దగ్గర అని అన్నారు. అయితే హైదరాబాద్ లో లక్ష ఇళ్లు నిర్మిస్తున్నామని, అందుకు సంబంధించిన జాబితా ఇచ్చామని, ఏమైనా అనుమానాలు ఉంటే చూసుకోండి అంటూ మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కి అతీగతీ లేదు అని, గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసేందుకు కనీసం 150 మంది అభ్యర్థులు అయినా ఉన్నారా అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ కి లేదు అని మంత్రి వ్యాఖ్యానించారు. పేదవాడికి ఇలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశంలోనే లేదు అని, కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నా, ఇండ్ల నిర్మాణం జరుగుతోంది అని మంత్రి వ్యాఖ్యానించారు.