సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి సోకిన కరోనా

Monday, March 8th, 2021, 01:50:39 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఊహించని విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మృతుల నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి కరోనా వైరస్ సోకింది. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మంత్రి తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఆమెను ప్రత్యేక ఐసోలేశన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తనను కలిసిన వారు, సన్నిహితులు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని అధికారులు చెబుతున్నారు.