మంత్రి పువ్వాడ కి కరోనా నెగటివ్

Saturday, December 26th, 2020, 09:00:49 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ప్రముఖులు, ఇలా చాలామంది కరోనా వైరస్ భారిన పడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పువ్వాడ అజయ్ కుమార్ కరోనా వైరస్ మహమ్మారి ను జయించారు. ఈ నెల 14 న పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లో స్వీయ నిర్బంధం లో ఉన్నారు పువ్వాడ అజయ్ కుమార్. ఇన్ని రోజులు వైద్యులు పర్యవేక్షణ లో చికిత్స పొందిన ఆయన తాజాగా జరిపిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది.

అయితే పువ్వాడ అజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు ప్రార్దనలు చేసిన సంగతి తెలిసిందే.అయితే కరోనా వైరస్ నెగటివ్ రావడం పట్ల పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. కరోనా వైరస్ మహమ్మరిను జయించడానికి తనకు ధైర్యం ఇచ్చింది పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలే అంటూ పేర్కొన్నారు. తన పై ఉన్న ప్రేమ, అభిమానమే తనను మళ్లీ మీ మధ్యలోకి తీసుకొచ్చింది అని అన్నారు. ప్రస్తుతం పూర్తి గా కొలుకున్నట్లు తెలిపారు అంతేకాక సోమవారం నుండి విధులకు హాజరు కానున్నట్లు తెలిపారు.