తెలంగాణలో ఆర్టీసి కార్గో – పార్శిల్ సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Thursday, December 10th, 2020, 02:09:10 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ఆర్టీసి కార్గో – పార్శిల్ సేవలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. గత మూడు నెలలు గా కొరియర్ పార్శిళ్ళ సేవల్లో తెలంగాణ ఆర్టీసి వేగవంతమైన వృద్ది సాధించింది అని తెలిపారు. ఇప్పటి వరకు 12 లక్షల 50 వేలకు పైగా సరుకు పార్శిల్ లను రవాణా చేసినట్లు మంత్రి వ్యాఖ్యానించారు. అయితే త్వరలోనే ఈ సంఖ్య 25 లక్షలకు చేరుకుంటుంది అని తెలిపారు. అయితే పార్శిల్ సర్వీసుల ద్వారా రోజుకి 15 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అని అన్నారు.

అయితే కూకట్ పల్లీ, ఎం జి బీ ఎస్, జే బీ ఎస్ ప్రాంతాల నుండి హోమ్ డెలివరీ చేయనున్నట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. అయితే ఈ సేవలకు ఇప్పుడిప్పుడే ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది అని, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహ రాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల లో పార్శిల్ సేవలను వేగవంతం చేస్తున్నాం అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే 800 కోట్ల రూపాయల కి పైగా రాష్ట్ర ఖజానా నుండి ఆర్టీసి కి చేరినట్లు మంత్రి వివరించారు.