కరోనా టీకా వేయించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి!

Monday, March 29th, 2021, 02:10:29 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా కి వాక్సిన్ అందుబాటులోకి రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీకా తీసుకోవడం పట్ల ప్రముఖులు, రాజకీయ నాయకులు, నిపుణులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరబాద్ లో రిమ్స్ ఆసుపత్రి లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. కరోనా విషయంలో అప్రమత్తత ముఖ్యం అని చెప్పుకొచ్చారు. అంతేకాక దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యం లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనవసరమైన పనుల కోసం బయటికి రాకపోవడం ఉత్తమం అని వ్యాఖ్యానించారు.