బిగ్ న్యూస్: విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు…మోడీ ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు!

Wednesday, March 10th, 2021, 03:10:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖ ఉక్కు కర్మాగారం ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విశాఖ వాసులు భగ్గుమంటున్నారు. అయితే ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. అయితే తెలంగాణ లోని బయ్యారం లో సెయిల్ ద్వారా ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం విశాఖ లో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు అంటూ అవేదన వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగులందరికీ అండగా నిలబడతామనీ, అవసరం అయితే కేసీఆర్ అనుమతి తో వైజాగ్ కి వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు ఇస్తామని కేటీఆర్ అన్నారు.

అయితే ఎక్కడో విశాఖ లో జరిగే ఉద్యమం మనకెందుకు లే అని అనుకుంటే రేపు మన దగ్గరికి వస్తారు అంటూ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బీహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేట్ పరం చేయండి అని అంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఏమైనా చేస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. అయితే తెలంగాణ లో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తే మాతో రావాలని కోరారు మంత్రి కేటీఆర్. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల సర్వత్రా చర్చాంశనీయం గా మారింది.