ఆ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలి – కేటీఆర్

Friday, February 12th, 2021, 04:02:37 PM IST

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరొకసారి ప్రతి పక్ష పార్టీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులం మరియు మతం పేరిట రెచ్చగొట్టే పార్టీ లకు ప్రజలు బుద్ది చెప్పాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నెలాఖరు కల్లా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి అంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. అయితే పుట్టుక నుండి చావు వరకూ ప్రతి ఒక్కరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరుతుంది అని అన్నారు. అయితే రైతుకి పెట్టుబడి ఇవ్వాలి అని ఇన్ని ఏళ్ళల్లో ఏ ప్రభుత్వం అయినా ఆలోచన చేసిందా అంటూ చెప్పుకొచ్చారు. అయితే పార్టీ లకు అతీతంగా కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు అందుతోంది అంటూ కేటీఆర్ తెలిపారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రం లో మాదిరి గా ఇతర రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఉందా అని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారుతోంది.