పట్టభద్రులను కదిల్చిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

Monday, March 15th, 2021, 09:22:30 AM IST

తెలంగాణ రాష్ట్రం లో పట్ట భధ్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి అయింది. అయితే ఈ ఎన్నికలలో 70.61 శాతం పోలింగ్ నమోదు అయింది. ఖమ్మం – నల్గొండ – వరంగల్ లో 76.35 శాతం పోలింగ్ నమోదు కాగా, మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ లో 64.87 శాతం పోలింగ్ నమోదు అయింది. గతంలో ఎన్నికల కంటే 25 శాతం పోలింగ్ పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గంటల కొద్ది క్యూ లైన్ లలో నిలిచి మరి ఓటర్లు ఓటు వేశారు.

అయితే ఇటీవల కాలంలో గ్యాస్ మరియు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే గతం లో ఇవే విషయాలను పార్లమెంట్ ఎన్నికల విషయం లో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. అవే వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. సమర్థత గల నాయకుడిని ఎన్నుకోండి అంటూ పట్ట భద్రులకు పిలుపు ఇచ్చారు. అయితే పలువురు ఓటర్లు గ్యాస్ సిలిండర్ లకు, పెట్రోల్ బంకు లకు దణ్ణం పెడుతూ సోషల్ మీడియా లో ఫోటోలను పోస్ట్ చేశారు. అయితే వాటిని మంత్రి కేటీఆర్ తో పాటుగా, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు షేర్ చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పట్ట భద్రులను మాత్రమే కాక, సామాన్య ప్రజలకు కూడా ఆకట్టుకున్నాయి.