ప్రభుత్వం తో పాటు ప్రజలకు భాధ్యత ఉంది – మంత్రి కేటీఆర్

Thursday, March 25th, 2021, 11:37:57 AM IST

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో 325 స్వచ్ఛ ఆటో లను ప్రారంభించారు. అయితే ఈ మేరకు మీడియా ద్వారా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వేళ స్వచ్ఛత చాలా అవసరం అంటూ పేర్కొన్నారు. హైదరాబాద్ ను చెత్తకుండీ లేని నగరం గా తీర్చి దిద్దుతామ్ అని వ్యాఖ్యానించారు. అయితే పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఈ స్వచ్ఛ నగర నిర్మాణం లో ప్రభుత్వం తో పాటు ప్రజలకు కూడా భాధ్యత ఉందని మంత్రి అన్నారు. అయితే హైదరాబాద్ మహ నగర అభివృద్ది కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ మహ నగరాన్ని తీర్చి దిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పలు రకాల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చెత్త సేకరణ కొరకు మొత్తం 650 కొత్త స్వచ్ఛ ఆటో లను కొనుగోలు చేయడం జరిగింది. అయితే మొదటి విడత గా మంత్రి కేటీఆర్ నేడు 325 ఆటో లను ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం లో గ్రేటర్ మేయర్ తో పాటుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.