ఆత్మ నిర్భర్ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యం…కేంద్రం పై కేటీఆర్ విమర్శలు!

Tuesday, March 23rd, 2021, 01:40:26 PM IST

మరొకసారి కేంద్ర ప్రభుత్వం పై తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని విభజన చట్టం లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఈ ఆరున్నరేళ్ళలో కేంద్రం నుండి ఒక్క పైసా కూడా రాలేదు అని నిప్పులు చెరిగారు. అయితే పార్లమెంటు లో రూపొందించిన చట్టాన్నే కేంద్రం తుంగలో తొక్కింది అని, ఆత్మ నిర్భర్ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అంటూ మంత్రి కేటీఆర్ అన్నారు.

అయితే ఆరేళ్ల లో టీఎస్ ఐపాస్ ద్వారా రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలిపారు. అంతేకాక పారిశ్రామిక వికేంద్రీకరణ లో భాగంగా హైదరబాద్ లోని అన్ని ప్రాంతాల తో పాటుగాజిల్లాల్లోనూపరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే కేంద్రం చేసినటువంటి చట్టాన్ని కేంద్రమే గౌరవించాలి అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఆత్మ నీర్భర్ ప్యాకేజీ వలన తమకు ఎలాంటి ఉపయోగం లేదని వ్యాపారవేత్తలే చెబుతున్నారు అంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే వీధి వ్యాపారులకు మాత్రం పది వేల రూపాయల రుణ సహాయం పొందేందుకు కొంతమేర ఉపయోగపడినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ఆ ప్యాకేజి వలన తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు అంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.