తెరాస ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోవద్దు

Monday, February 1st, 2021, 08:24:32 AM IST

తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీకి చెందిన తెరాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పై దాడి జరిగిన సంగతి సర్వత్రా చర్చంశనీయం గా మారింది. ఈ వ్యవహారం పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెరాస శ్రేణులను, కార్యకర్తలను కాపాడుకొనే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయి అని బీజేపీ గుర్తుంచుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే తెరాస కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి తెరాస కి ఉంది అంటూ గట్టి సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్.

తమ ఒపికకి హద్దు ఉంటుంది అని, ఇప్పటికే బీజేపీ ను హెచ్చరించిన విషయం ను గుర్తు చేశారు. అయితే ఇక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ గా సంయమనం తో, ఓపిక తో ముందుకు పోతున్నాం అంటూ మంత్రి తెలిపారు. అయితే తెరాస ఒక ఉద్యమ పార్టీ అనే విషయం ను బీజేపీ మర్చిపోవద్దు అంటూ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యం లో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు అంటూ మంత్రి తెలిపారు. అయితే తమ వాదన లతో ప్రజలను ఒప్పించడం చేతకాక ఇతర పార్టీ కి చెందిన వారి పై భౌతిక దాడులకు పాల్పడుతున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్య వాదులు అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అంటూ మంత్రి అన్నారు.