మూడో టెస్ట్ మ్యాచ్ ఫలితం పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Tuesday, January 12th, 2021, 08:41:07 AM IST

ఆస్ట్రేలియా తో టీమ్ ఇండియా టెస్ట్ సీరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మూడవ టెస్ట్ మ్యాచ్ ను టీమ్ ఇండియా డ్రా తో ముగించింది. అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆడిన ఆట తీరు పై, ఫలితం పై తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ, ఐట మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదొక అద్భుతమైన టెస్ట్ అని, భారత ఆటగాళ్ళ తెగువ, పట్టుదల, దైర్యానికి నిదర్శనం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక వైపు ఆటగాళ్ళు గాయాల భారిన పడినా, మరొక వైపు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురు అయినా, ఇవేవీ కూడా జట్టు స్ఫూర్తి ను దెబ్బ తీయలేదు అని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన హనుమ విహారి, అశ్విన్ ల ఆటతీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ డ్రా ఇన్నింగ్స్ విజయం కంటే కూడా ఎంతో బావుంది అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు సైతం వీరి ఆట తీరును మెచ్చుకుంటున్నారు.