క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించాం – కేటీఆర్

Thursday, June 10th, 2021, 01:30:26 PM IST


తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకు పోతుంది అంటూ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించాం అని వ్యాఖ్యానించారు. అయితే ఎంసీహెచ్ఆర్డిఏ లో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ ల వార్షిక నివేదిక ను మంత్రి కేటీఆర్ విడుదల చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పారదర్శకత కోసమే వార్షిక నివేదిక విడుదల చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే సీఎం కేసీఆర్ విధి విధానాలు, సమిష్టి కృషి తోనే ఈ రంగాల్లో అభివృద్ది సాధ్యం అయింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత తో దేశంలోనే అగ్రగామి గా ఎదుగుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే 2019-20 లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 1.28 లక్షల కోట్ల రూపాయలు అని, అదే 2020-21 లో 1.45 లక్షల కోట్ల రూపాయలు అని వ్యాఖ్యానించారు.అదే దేశం తో పోల్చితే రెట్టింపు వృద్ది సాధించాం అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.