కరోనా కట్టడికి నిధుల కొరత లేదు – మంత్రి కేటీఆర్

Sunday, May 16th, 2021, 05:04:37 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ కట్టడికి నిధుల కొరత లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ కోవిడ్ పై పొరకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే కరోనా వైరస్ చికిత్స కోసం తెలంగాణ కి వస్తున్న ఇతర రాష్ట్రాల బాధితులకు కూడా చికిత్స అందిస్తున్నాం అని అన్నారు. అయితే ఆక్సిజన్ మరియు ఔషధాల సరఫరా పెంచాలి అని కేంద్రాన్ని కోరగా, సానుకూలంగా స్పందించింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చైనా నుండి 200 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అందాయి అని వివరించారు. అయితే వీటిని గ్రీన్ కో సంస్థ దిగుమతి చేసింది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే కార్గో విమానం లో ఇవి శంషాబాద్ చేరాయి అని వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్ కో ప్రతినిధులు వాటిని మంత్రి కేటీఆర్ కి అందజేశారు. అయితే ఈ నేపథ్యం లో మంత్రి కేటీఆర్ మరియు సోమేశ్ కుమార్ లు గ్రీన్ కో కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ కట్టడి కి ఇవి కీలకం కానున్న సంగతి తెలిసిందే.