ఆత్మ గౌరవానికి ప్రతీక గా ఈ రెండు పడక గదుల ఇళ్లు – కేటీఆర్

Wednesday, December 16th, 2020, 12:57:40 PM IST

హైదరాబాద్ నగరం లో వనస్థలిపురం పరిధిలోని రైతు బజార్ వద్ద 324 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే ప్రారంభించిన అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పేదొడు ఆత్మ గౌరవం తో బతకాలని అనేది సీఎం కేసీఆర్ ఉద్దేశ్యం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకు అనుగుణంగా పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక గా ఈ రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాం అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి ఇళ్లను భారతదేశంలో ఏ రాష్ట్రం లో ఏ ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో కూడా ఇలాంటివి నిర్మించ లేదు అని, రెండు పడక గడులతో పాటుగా ఒక హాలు, కిచెన్ తో పాటుగా రెండు బాత్ రూమ్ లని నిర్మించాం అని తెలిపారు.

అయితే ఒక్కొక్క ఇంటికి దాదాపు 9 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారు. దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే ఫ్లాట్ లను పేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు అని అన్నారు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇళ్లు నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కమర్షియల్ అపార్ట్మెంట్ తరహాలో వీటిని నిర్మించినట్లు వివరించారు. ఇల్లు బావుంటే సరిపోదు అని, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. చెత్తను ఇళ్ళ మద్య పారేయొద్దు అని, రోగాలు, జబ్బులు రాకుండా, పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలి అన్న పరిశుభ్రం గా ఉంచుకోవాలి అంటూ మంత్రి కేటీఆర్ అన్నారు.