మంత్రి కొప్పుల ఈశ్వర్ కి కరోనా వైరస్ పాజిటివ్

Sunday, May 9th, 2021, 04:01:24 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దేశ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో గణనీయంగా పెరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా చేయించుకున్న కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి అని, ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేశన్ లో ఉన్నట్లు తెలిపారు. అయితే తనను గత కొద్ది రోజులుగా కలిసిన వారు అంతా కూడా కరోనా వైరస్ ప్రోటోకాల్స్ పాటించాలి అని, కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో ఇంకా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.