దుబ్బాక లో మీటింగ్ పెట్టీ ప్రజలకు ఏం చెప్తారు – మంత్రి హరీశ్ రావు

Monday, October 12th, 2020, 09:08:12 PM IST

దుబ్బాక ఉపఎన్నిక అంశం పై అధికార పార్టీ తెరాస మరియు కాంగ్రెస్ పార్టీ లు ఒకరు పై మరొకరు వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే మంత్రి హరీశ్ రావు విపక్షాల పై మరోమారు విరుచుకు పడ్డారు. ఫార్మా సిటీ వస్తే వందల మంది కి ఉద్యోగాలు వస్తాయి అని యువత చూస్తోంటే, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాత్రం దాన్ని అడ్డుకుంటాం అని అంటున్నారు అని విమర్శించారు. కాళేశ్వరం నీళ్ళు, 24 గంటల కరెంట్, ఇంటింటికీ నీళ్ళు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని అడ్డుకుంటున్నారు అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే నేడు నిజామాబాద్ లో తెరాస గెలిచింది, రేపు దుబ్బాక లో కూడా తెరాస గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ ను ఆ నేతలే వదిలి వేరే పార్టీ లోకి వెళ్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు తెరాస లో చేరారు అని, ఇప్పుడు దుబ్బాక లో మీటింగ్ పెట్టీ ప్రజలకు ఏం చెప్తారు అంటూ సెటైర్స్ వేశారు. అయితే ఇంటింటికీ దుబ్బాక లో నీళ్ళు ఇచ్చింది తెరాస నే అని, ఓటు అడిగే హక్కు తమకే ఉంది అని, ఇప్పుడు 24 గంటలు కరెంట్ తెరాస ఇస్తుంది అని, కాంగ్రెస్ కాదు అని తెలిపారు.