మా పార్టీ ఉన్నన్ని రోజులు వేరే పార్టీ మనుగడ సాధించలేదు – గంగుల కమలాకర్

Tuesday, February 9th, 2021, 01:36:09 PM IST

తెలంగాణ రాష్ట్రం లో షర్మిల పార్టీ పై అధికార పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ మేరకు అధికార పార్టీ తెరాస కి చెందిన కీలక నేత, మంత్రి గంగుల కమలాకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెరాస కి తెలంగాణ రాష్ట్రం లో ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేదు అని ధీమా వ్యక్తం చేశారు. తెరాస లో ఎటువంటి ధిక్కార స్వరాలు లేవు అని స్పష్టం చేశారు. అయితే మా పార్టీ ఉన్నన్ని రోజులు వేరే పార్టీ మనుగడ సాధించలేదు అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ కి, తమ నేత కేసీఆర్ కి ప్రత్యామ్నాయం లేదు, రాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు అందరూ కూడా కేసీఆర్ ను కోరుకుంటున్నారు అని, ప్రస్తుతం సంతోషంగా ఉన్న ప్రజలే వేరే శక్తులు వచ్చి ఫ్యాక్షనిజం చేస్తాం అంటే ఒప్పుకోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం కి చిత్తశుద్ది ఉంటే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకు రావాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే చట్ట సభల్లో బీసీ లకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించట్లేదు అంటూ సూటీగా ప్రశ్నించారు. కులాల ఆధారంగా జనాభా గణన జరగాలి అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఎంబీసీ అంటే బీజేపీ నేతలకు తెలుసా, కేసీఆర్ ఎంబిసి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలకి ప్రతి పక్ష నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.