కరోనా టీకా వేయించుకున్న మంత్రి ఈటెల రాజేందర్

Monday, March 1st, 2021, 12:40:33 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే నేటి నుండి రెండవ దశ అతి పెద్ద వాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఈ ప్రక్రియ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. నేడు హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి లో మొదటి డోసు కరోనా వైరస్ వాక్సిన్ ను తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి తో పోరాడేందుకు వైద్యులు మరియు శాస్త్రవేత్తల నిరంతర కృషిని మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. అయితే ఈ వాక్సిన్ వేయించుకొనెందుకు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని మంత్రి తెలిపారు. అయితే నేటి నుండి 60 ఏళ్లు పై బడిన వారికి, 45 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయసు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కరోనా వాక్సిన్ ప్రభుత్వం అందిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా వాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం cowin లో రిజిస్టర్ కావాల్సి ఉంది.