డాక్టర్ నరేష్ మరణం చాలా బాధాకరం – మంత్రి ఈటెల

Monday, August 10th, 2020, 10:09:48 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు అన్ని విధాలుగా ముందు ఉన్న డాక్టర్ ల గురించి మంత్రి ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా వైరస్ సోకిన రోగులకు నిరంతరం చికిత్స అందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎం హెచ్ఓ డాక్టర్ నరేష్ మరణించారు. అయితే నరేష్ మరణం చాలా బాధాకరం అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇవ్వడం తో పాటుగా, నరేష్ భార్యకు సముచిత స్థానం గల ఉద్యోగాన్ని ఇప్పిస్తాం అని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

అయితే కరోనా పై పోరు లో వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి మరి పని చేస్తున్నారు అని, కరోనా పై పోరు లో వారు చేస్తున్న సేవలను వెలకట్ట లేం అని మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. అయితే ఈ పోరు లో వైద్యులు డైర్యంగా పోరాడాలి అని అన్నారు. వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండదండలు ఉంటాయి అని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ కేసులు తగ్గు ముఖం పట్టే అవకాశం ఇపుడు అపుడే లేదు అని నిపుణులు సైతం అంటున్నారు.