కాంగ్రెస్, బీజేపీ లు ఎండమావులు వంటివి – హరీశ్ రావు

Sunday, October 18th, 2020, 03:00:21 AM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం లో అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మేరకు అధికార పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ లు ఎందమావులు వంటివి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి వెంట వెళ్తే ఏమి రాదు అని దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం లోదౌల్టాబాద్ లోని ముబారస్ పుర్ లో మాట్లాడారు.

అయితే కాంగ్రెస్ మరియు టీడీపీ ప్రభుత్వాలు గతంలో త్రాగునీటి సమస్యను కూడా తీర్చ లేకపోయాయి అని అన్నారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు విద్యుత్ కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారు అని తెలిపారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి పీడిత సమయంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు.వానాకాలం లో ఉసిల్లు వచ్చినట్లు గా కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలు వచ్చి పోతారు అంటూ మంత్రి హరీశ్ రావు ఘాటు విమర్శలు చేశారు. అయితే తెరాస మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తోంది అని తెలిపారు.