జానారెడ్డి పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతుంది – జగదీష్ రెడ్డి

Tuesday, March 30th, 2021, 04:09:38 PM IST

తెలంగాణ రాష్ట్రం లో అనివార్యమైన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తో ఆకలి చావులు లేకుండా పోయాయి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రం లో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చమని తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక అభివృద్ది కి జానారెడ్డి చేసిందేమీ లేదు అని, అందుకే ఆయన్ను 2018 లోనే ప్రజలు తిరస్కరించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన ప్రచారం చేయను అని చెప్పడం లోనే పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలంగాణ రాష్ట్రం లో తెరాస అధికారం చేపట్టిన తర్వాత నుండి ఏడేళ్ల లో సాగర్ అభివృద్ది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు. అయితే సాగర్ ఉపఎన్నిక లో తెరాస అభ్యర్ధి మంచి మెజారిటీ తో గెలుపొందడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.