ఐటీ హబ్ ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి – మంత్రి సబితా

Friday, January 22nd, 2021, 04:30:40 PM IST

తెలంగాణ రాష్ట్రం లో నిరుద్యోగం ను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్ లను ఏర్పాటు చేస్తోంది. అయితే వీటి ద్వారా స్థానికంగా ఉండే యువత లబ్ది పాందే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వం లో ఏర్పాటు చేసిన ఖమ్మం ఐటీ హబ్ ద్వారా స్థానిక యువత కి ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన లభిస్తాయి అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అయితే ఖమ్మం నగరం లో కొత్తగా ప్రారంభించిన ఐటీ హబ్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి సందర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్ ల ఏర్పాట్లు చేస్తోంది అని మంత్రి తెలిపారు.అయితే స్థానికంగా ఉండే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, సొంత ప్రాంతాల్లోనే ఐటీ ఉద్యోగాలు పొందడం వలన జీవన ప్రమాణాలు మెరుగ్గా అవుతాయి అని అన్నారు.అయితే ఖమ్మం కి ఐటీ హబ్ ను తీసుకురావడం పట్ల మంత్రి పువ్వాడ కి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలియజేశారు.