వారికి క్షమాపణలు చెప్పేందుకు సిద్దం – తలసాని శ్రీనివాస్ యాదవ్

Sunday, January 17th, 2021, 06:30:32 PM IST

ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు చర్చంశనీయం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మేరకు తను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు.తాను గంగపుతలనుబాధపెట్టే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అని అన్నారు. అయితే తన వ్యాఖ్యలు ఏవైనా తప్పుగా ఉన్నాయి అని భావిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్దం గా ఉన్నా అంటూ చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి గంగ పుత్రుల సంక్షేమం అభివృద్ధి పట్టించుకున్న వారు లేరు అని ఆవేదన వ్యక్తం చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్.