రోజుకి పదిలక్షల మందికి వాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం

Wednesday, January 20th, 2021, 02:21:14 PM IST

కరోనా వైరస్ మహమ్మారికి వాక్సిన్ ను అందుబాటులో కి తీసుకు వచ్చిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ను దేశంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దేలా చర్యలు చేపడుతున్నాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అంతేకాక వైద్య పరీక్షల ఖర్చును తగ్గించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నస్టిక్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కరోనా వాక్సినేషన్ ప్రక్రియ లో తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసిందని, రోజుకి పదిలక్షల మంది కి కరోనా వాక్సిన్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేశామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు.

అయితే హైదరాబాద్ కేంద్రం గా తయారు అయిన కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తుంది అని ఆశిస్తున్నా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లోని ఏజెన్సీ ప్రాంతంలో వాక్సినేషన్ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది అని కితాబు ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. అనేక రకాల వాక్సిన్ ల పంపిణీ లో తెలంగాణ కి మెరుగైన రికార్డ్ ఉందని అన్నారు.అయితే రెండో విడత భాగం లో రాష్ట్రానికి మూడున్నర లక్షల వాక్సిన్ వచ్చింది అని మంత్రి తెలిపారు. రాష్ట్రం లో కొవాగ్జిన్ డోస్ లు మాత్రం 20 వేలు వచ్చాయి అని, మున్ముందు ఇంకా ఎక్కువ అందుబాటులోకి వస్తాయి అని మంత్రి తెలిపారు.