బిగ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్ట్

Thursday, April 8th, 2021, 02:03:12 PM IST

దేశంలో లక్ష కి పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది మూడో సారి. వరుసగా భారీ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కల్గించే విషయం అని తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల హైకోర్ట్ మరొకసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలు గా మారాయి అంటూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల పై గురువారం నాడు కోర్ట్ లో విచారణ జరిగింది.

అయితే కరోనా వైరస్ మార్గదర్శకాల అమలు పై డీజీపీ నివేదిక ఇచ్చారు. అయితే ఆర్టిపిసిఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారు అంటూ మరొకసారి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆర్టిపిసిఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలి అంటూ తెలిపింది. మద్యం దుకాణాలు, పబ్ లు, థియేటర్ల వద్ద రద్దీ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అంతేకాక నిపుణుల తో సలహా కమిటీ ఏర్పాటు చేయాలంటూ సూచించింది. అయితే డిజిపి ఇచ్చిన నివేదిక పై పలు ప్రశ్నలు సంధించింది. కరోనా వైరస్ ను అరికట్టడం కొరకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.